Coronavirus Cases in India: తగ్గని కరోనా మరణాల సంఖ్య
Coronavirus Cases in India: గడచిన 24 గంటల్లో కోత్తగా 2,57,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరమే
Coronavirus Cases in India : భారతదేశంలో మళ్లీ కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటింది. ఒకవైపు రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. మరోవైపు మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు సైతం 30 లక్షల లోపుకు పడిపోయాయి. గడచిన 24 గంటల్లో మొత్తం 4194 మంది చనిపోగా, కొత్తగా 2 లక్షల 57 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 3 లక్షల 57 వేల మంది డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 29,23,400.
భారత్ లో ఇప్పటివరకు మొత్తం 2,59,525 మంది కరోనా వల్ల చనిపోయారు. కరోనా పేషెంట్ల రికవరీ రేటు 87.25 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 11.63 గా ఉంది. మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 1,58,895 కాగా.. మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 19 కోట్లు దాటింది.