Patna Blast: 2013 పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష
Patna Blast: ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు
Patna Blast: బిహార్ రాజధాని పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష పడింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. నలుగురికి ఉరిశిక్షతో పాటు ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించివంది. మరో దోషికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
2013లో ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. మోడీ ప్రసంగం చేయాల్సిన వేదికకు 150 మీటర్ల దూరంలో వరుసగా ఆరు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 70 మందికి గాయపడ్డారు.
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ 11 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు 9 మందిని దోషులుగా తేల్చింది. సోమవారం వారికి శిక్షలు ఖరారు చేసింది.