భారత్‌లో పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్‌ కేసులు.. 2 లక్షలకు చేరువలో...

Corona and Omicron Cases in India: గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారిన పడి 145 మంది మృతి...

Update: 2022-01-10 03:57 GMT

భారత్‌లో పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్‌ కేసులు.. 2 లక్షలకు చేరువలో...

Corona and Omicron Cases in India: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో లక్షా 78వేల 938 కరోనా కేసులు వెలుగుచూడగా.. వైరస్‌ బారిన పడి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో భారత్‌లో క్రియాశీలక కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 లక్షల మార్క్‌ను దాటేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరుకుంది.

మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 220 కేసులు వెలుగుచూడటంతో.. దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3వేల 891కి చేరింది. ఇప్పటికే వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేశాయి. నైట్‌ కర్ఫ్యూతో పాటు.. వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది 400 మందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. జనవరి 4 నుంచి 8 మధ్య వరకు పార్లమెంటు సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 400 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు.. ఢిల్లీలో రోజుకి 20వేలకు పైగా కేసులు వస్తున్నప్పటికీ లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం లేదని సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ చెప్పారు. మరోవైపు.. అత్యధికంగా మహారాష్ట్రలో 41 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వం.. కోవిడ్‌ ఆంక్షలను కొంత సవరించింది.

Tags:    

Similar News