2-DG Drug: మార్కెట్లో కి 2-డీజీ డ్రగ్ విడుదల

కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునే విధంగా ఈ 2–డీజీ ఔషధాన్నిడాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.

Update: 2021-05-27 07:52 GMT

2- DG Drug:(File Image)

2-DG Drug: కరోనా నియంత్రణకు ఇప్పటివరకు రకరకాల మందులు వాడుతున్నారు. రెమ్ డెసివర్ లాంటి వాటికైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాగే స్టెరాయిడ్స్ వాడిన వారికి బ్లాక్ ఫంగస్ ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి సమస్యలేమీ లేకుండా కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునే విధంగా 2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌)' ఔషధాన్నిడాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే.

కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) . 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.

గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కరోనాకు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరం లోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందక పోతే కణ విభజన జరగదని, దానివల్ల శరీరంలో కరోనా వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పుడీ ఔషధం ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని డిఆర్‌డివొ పేర్కొంది.

Tags:    

Similar News