రాజ్యసభలో 19 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు

*వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేసిన సభ్యులు

Update: 2022-07-26 09:51 GMT

రాజ్యసభలో 19 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు

Rajya Sabha: రాజ్యసభలో 19 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు సభ్యులు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గించారంటూ స్పీకర్ సస్పెండ్ చేశారు. వారం రోజులు సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు డిప్యూటీ ఛైర్మన్.

సస్పెండైన 19 మందిలో ముగ్గురు టీఆర్ ఎస్ సభ్యులు, ఏడుగురు తృణమూల్ సభ్యులు, ఆరుగురు డీఎంకే సభ్యులు, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ సభ్యులు ఉన్నారు. టీఆర్ ఎస్ నుంచి దామోదర్ రావు, రవీంద్ర వద్దిరాజు, లింగయ్య యాదవ్ సస్పెండ్ అయ్యారు. తృణమూల్ సభ్యులు సుష్మితాదేవ్ , మౌసం నూర్ , శాంతా ఛెత్రి, సంతాను సేన్ , అభిరంజన్ బిశ్వర్ , నదీమ్ ఉల్ హక్ , దోలా సేన్ పై సస్పెండ్ వేటు పడింది. అలాగే డీఎంకే సభ్యులు కణిమొలి, షణ్ముఖం, ఇలంగో, గిర్ రాజన్ , కల్యాణ సుందరం, హమామద్ అబ్దుల్లా సస్పెండ్ అయ్యారు. సీపీఎం నుంచి శివదాసన్ , రహీం, సీపీఐ సభ్యుడు సందోష్ కుమార్ ను వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ వెల్లడించారు. 

Tags:    

Similar News