పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ కరోనా పరీక్ష చేపట్టారు. అయితే కరోనా పరీక్షలో సుమారు 17 మంది ఎంపీలకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అత్యధికంగా బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో బయటపడింది. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన, డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం), ఆర్‌ఎల్‌పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ) ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతి ఒక్క సభ్యుడు కరోనా టెస్టులు చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు నిన్న, ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన ఎంపీలు వీరే...
ఎన్.రెడ్డెప్ప
గొడ్డేటి మాధవి
మీనాక్షి లేఖి
అనంత్ కుమార్ హెగ్డే
పర్వేశ్ సాహిబ్ సింగ్
సుఖ్ బీర్ సింగ్
హనుమాన్ బేణివాల్
సుకనాటా మజుందార్
ప్రతాప్ రావ్ జాదవ్
జనార్దన్ సింగ్
బిద్యుత్ బరణ్
ప్రదాన్ బారువా
జి. సెల్వమ్
ప్రతాప్ రావ్ పాటిల్
రామ్ శంకర్ కతేరియా
సత్యపాల్ సింగ్
రోద్మాల్ నాగర్