Ancient Idols: భారత్‌కు తిరిగి విదేశాల్లో ఉన్న భారత కళా సంపద
Ancient Idols: అమెరికా నుంచి 150 పురాతన విగ్రహాలు
Ancient Idols: విదేశాల్లో ఉన్న భారత కళా సంపదను నరేంద్ర మోడీ సర్కార్ వెనక్కి తీసుకు వస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి అమెరికా నుంచి దాదాపు 150 పురాతన విగ్రహాలు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే తీసుకొచ్చిన వాటిలో తమిళనాడుకు చెందినవి 2, ఏపీకి చెందిన ఒక విగ్రహం ఉన్నట్లు తెలిపారు. త్వరలో వాటిని ఆయా రాష్ట్రాలకు అందజేస్తున్నట్లు కిషన్‌రెడ్డి అన్నారు.