India - Japan: ఢిల్లీలో భారత్-జపాన్ ప్రధానుల మధ్య 14వ శిఖరాగ్ర సదస్సు
India - Japan: *భారత్‌లో జపాన్ రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు *సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్
India - Japan: భారత్-జపాన్ మధ్య 14వ శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భారీ ప్రకటన చేశారు. భారత్ లో జపాన్ 3 పాయింట్ 2 లక్షల కోట్ల పెట్టుబడులను పెడుతోందని మోదీ తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాలానికి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులతో పాటు ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ బుల్లెట్ రైలు సాంకేతికతపై ఆధారపడిన హై-స్పీడ్ రైల్వే అంశాలను కూడా ఇరు నేతలు చర్చించారు.
శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్‌ఫర్మేషన్ షేరింగ్ సహకారం రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీజపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలకు భారత్‌లో సాధ్యమైన అన్నివిధాల సహాయ సహకారాలను అందిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.