Corona Virus Updates: మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Coronavirus Updates: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు నమోదు అవుతున్నాయి.

Update: 2021-03-03 09:02 GMT

ఫైల్ ఇమేజ్


Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు 16వేలకు పైగా కేసులు నమోదు కాగా మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది. తాజాగా 13,123 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,08,12,044 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం తెలిపింది. మరో 98 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,70,126 క్రియాశీల కేసులు ఉన్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,56,20,749 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

తెలంగాణ లో 168 పాజిటివ్ కేసులు...

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 40,444 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,254కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఎవరూ మృతిచెందలేదని, కరోనా బారి నుంచి నిన్న 163 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,707కి చేరుకోగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,53 ఉండగా.. వీరిలో 796 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 29 కేసులు నమోదయ్యాయని, తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 88,01,651కి చేరిందని తెలిపారు.

Tags:    

Similar News