Ayodhya Ram Mandir: శ్రీరాముడిపై 14 యేళ్ల బాలిక 'ఉడతా భక్తి'.. రామమందిర నిర్మాణానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళం

Ayodhya Ram Mandir: జగమంతా సంబరంలా.. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కాసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది.

Update: 2024-01-22 05:44 GMT

Ayodhya Ram Mandir: శ్రీరాముడిపై 14 యేళ్ల బాలిక 'ఉడతా భక్తి'.. రామమందిర నిర్మాణానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళం

Ayodhya Ram Mandir: జగమంతా సంబరంలా.. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కాసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోడీ.. అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై.. ఒంటిగంటకు ముగియనుంది.

ఇదిలా ఉంటే.. అయోధ్య బాలరాముడికి భారీగా కానుకలు వచ్చాయి. సూరత్‌కి చెందిన14 యేళ్ల బాలిక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి విశేష విరాళం అందించింది. అయోధ్య రామ మందిరానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. సూరత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక భవికా మహేశ్వరి రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. ఆ కథలను కొవిడ్‌ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది. 2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 50వేల కిలోమీటర్లు ప్రయాణించి 300పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52 లక్షల వరకూ సేకరించి ఆ నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.

"శ్రీరాముడికి సహాయం చేయడానికి ఉడత ముందుకు వచ్చినట్లే, నేను కూడా రామ మందిర నిర్మాణం కోసం నా వంతు సహాయం చేశాను. ఇలా చేయడానికి నేను నా తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందాను. చిన్నప్పటి నుంచి రామాయణం చదివేదాన్ని. ఎన్నో తరాల వారు రామ మందిరాన్ని చూడలేకపోయారు. కానీ భవ్య రామమందిరం మా తరంలో రూపుదిద్దుకోవడం మా అదృష్టం."--భవికా మహేశ్వరి

Tags:    

Similar News