కేరళ శబరిమలలో కరోనా కలకలం
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కరోనా కలకలం రేగింది. విధులు నిర్వహిస్తున్న 2వేల 573 మంది సిబ్బందిలో 136 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా 61 మంది పోలీసులు ఉన్నారు.
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కరోనా కలకలం రేగింది. విధులు నిర్వహిస్తున్న 2వేల 573 మంది సిబ్బందిలో 136 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా 61 మంది పోలీసులు ఉన్నారు. పంబా వద్ద విధులు నిర్వహిస్తున్న 47 మంది పోలీసులతో పాటు సన్నిధానం దగ్గర విధులు నిర్వహిస్తున్న 11 మంది, నీలక్కల్ వద్ద విధులు నిర్వహిస్తున్నవారిలో ముగ్గురు పోలీసులు కరోనా బారినపడ్డారు.
ఇప్పటివరకూ 16వేల 205 మందికి కరోనా టెస్టులు చేశారు వైద్యులు. వీరిలో 13వేల 625 మంది అయ్యప్ప భక్తులు ఉండగా.. 47 మంది భక్తులు కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు ఓ వైద్యాధికారికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. దీంతో వైద్యాధికారి దగ్గరకు చికిత్స కోసం వచ్చిన భక్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.
కరోనా కారణంగా దాదాపు 7 నెలల పాటు మూతపడ్డ శబరిమల ఆలయం.. నవంబర్ 15న తెరుచుకుంది. డిసెంబర్ 26 వరకు శబరిమలలో మండల పూజలు జరగనున్నాయి. డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.