Fire Accident in COVID-19 Hospital: కోవిడ్ ఆసుపత్రిలో మంటలు-13 మంది మృతి
Fire Accident in COVID-19 Hospital: షార్ట్ సర్క్యూట్‌తో ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి.
Fire Accident in COVID-19 Hospital: మహారాష్ట్రలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. చాలామంది గాయాలపాలయ్యారు. ఈఘటన జరిగే సమయంలో ఐసీయూలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ వీరార్ పరిధిలోని విజయ్ వల్లభ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది తెలిపిన షార్ట్ సర్క్యూట్‌తో ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగినట్లు సమాచారం. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 13 మంది రోగులు మరణించారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు చేరుకొని రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడంతో దాదాపు 24 మందికి పైగా మరణించారు. ఈసంఘటన మరిచిపోకముందే.. మరో కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు.