Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ రూ.1100 కోట్లు సీజ్

Lok Sabha Elections 2024: ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక మొత్తంలో అమౌంట్‌ సీజ్

Update: 2024-05-31 14:09 GMT

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ రూ.1100 కోట్లు సీజ్ 

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ సోదాల్లో 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. దీంతో నగలు కూడా ఉన్నాయి. మే 30వ తేదీ వరకు ఐటీ శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన క్యాష్, జువెల్లరీనీ సీజ్ చేసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈసారి ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో అమౌంట్‌ను సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, జువెల్లరీని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో 150 కోట్ల వరకు సీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు వందకోట్ల వరకు నగదును పట్టుకున్నారు.

Tags:    

Similar News