Tamilnadu: ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి
Tamilnadu:ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు.
Tamilnadu: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కరంగా కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన బాధితులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే మరణాలు సంభవించినట్టు గుర్తించారు. దీంతో లోపం ఎక్కడ జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఇలాంటి ఘటనే కర్ణాటకలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. కర్ణాటలోని చామరాజనగర్‌లో ఉన్న జిల్లా దవాఖానలో సోమవారం తెల్లవారుజామున ఆక్సిజన్ అందకపోవడంతో 2 గంటల్లో 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో కొందరు కోవిడ్ పేషంట్లు కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటల మధ్య వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.