Corona Cases In India: భారత్‌లో మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
Corona Cases In India: బెంగళూరులో 12 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా
Corona Cases In India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ 10వేలు దాటుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 10వేల 549 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3కోట్ల 45లక్షల 55వేల 431కి పెరిగాయి. మహమ్మారి వల్ల 4లక్షల 67వేల 468 మంది మృతి చెందారు. మరో లక్షా 10వేల 133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. ఒక్కరోజులో వైరస్ బారిన పడి 488 మంది చనిపోయారు. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అటు కర్ణాటకలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు మరసూర్‌లోని స్ఫూర్తి కాలేజీలో 12 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 11 మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఒక యువతి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఇక ఈ విద్యార్థులను కలిసిన వారితోపాటు మిగతా విద్యార్థులకు కూడా కరోనా టెస్ట్‌లు చేస్తామని కాలేజీ అధికారులు తెలిపారు.
ఇక హైదరాబాద్‌లోని టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం రేగింది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్టూడెంట్స్ కోవిడ్ బారిన పడడంతో రెండ్రోజులపాటు సెలవు ప్రకటించినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని దుండిగల్ మండల వైద్యులు వెల్లడించారు.