ICMR: కరోనా విజేతలకు కొవాగ్జిన్ ఒక్క డోసు చాలు
ICMR: కరోనా విజేతలకు కొవాగ్జిన్ సింగిల్ డోస్ చాలని ఐసీఎంఆర్ అంటోంది.
ICMR: కరోనా విజేతలకు కొవాగ్జిన్ సింగిల్ డోస్ చాలని ఐసీఎంఆర్ అంటోంది. ఈ విషయంపై ఐసీఎంఆర్ పలు అధ్యయనాలు చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక డోసు వ్యాక్సిన్ వేసినా రెండు డోసులన్ని ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనంలో తేలింది. అయితే ఈ విషయంపై విస్తృతంగా అధ్యయనాలు చేయాలని, అందులోనూ ఈ విషయం రుజువైతే విజేతలకు ఒకే ఒక్క డోసు కొవాగ్జిన్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది.
ఈ అధ్యయనాన్ని చెన్నైలో నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు ఫస్ట్ డోస్ కొవాగ్జిన్ పొందిన 114 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లలో ప్రతిరక్షకాల స్పందనను పరిశీలించారు. టీకా వేసిన 28 రోజులు, 56 రోజులకు వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయిన తీరును అంచనా వేస్తున్నారు.