సరిగ్గా మనం అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులను వాడినా అయిదు వందల కంటే ఎక్కువ బిల్లు అయితే రాదు . కానీ ఓ ఇంటికి మాత్రం ఏకంగా కోట్లల్లో బిల్లు వచ్చింది . అది కూడా అక్షరాల 128 కోట్లు .. ఈ సంగతి అ ఇంటికి కరెంట్ కట్ చేసే వరకు తెలియలేదు . ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని హవూర్లో చోటు చేసుకుంది . అక్కడ స్థానికంగా నివసించే షమీమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు .. ఆయనకి గత నెల కరెంట్ బిల్లు అక్షరాల 128 కోట్లు వచ్చింది .దీనిని అధికారాల దృష్టికి తీసుకువెళ్తే అది పొరపాటుగా జరిగిందని చెప్పడం మానేసి మాకు అదంతా తెలియదు . బిల్లు కడితేనే కరెంట్ అని చెప్పుకొచ్చారు . ఇదంతా అ నోటా ఈ నోటా పడడంతో వ్యవహారం మీడియా వరకు వెళ్ళింది . దీనితో అధికారులు స్పందించి సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని , త్వరలో కరెంట్ ని అందిస్తామని చెప్పుకొచ్చారు . దీనితో అధికారుల తీరుపై అ ఇంటి యజమాని షమీమ్ మండిపడ్డాడు.. హవూర్ నగరానికి రావాల్సిన కరెంట్ బిల్లు మొత్తం తన ఇంటికే వచ్చిందని చెప్పుకొచ్చాడు .