Zombi Reddy: తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్
తెలుగులో తొలిసారి జాంబీ జోనర్ సినిమా చేయడమే ఓ సాహసం.
తెలుగులో తొలిసారి జాంబీ జోనర్ సినిమా చేయడమే ఓ సాహసం. వైవిధ్యభరితమైన కథలను తనదైన మార్క్‌లో ప్రజెంట్ చేసే ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలి తెలుగు జాంబీ మూవీ ప్రేక్షకుల ముందకు వచ్చింది 'జాంబి రెడ్డి'. యంగ్ హీరో తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ హీరో హీరోయిన్లుగా నటించగా.. పృథ్వీరాజ్, గెటప్ శీను, హేమంత్, హర్షవర్ధన్, అదుర్స్ రఘు, అన్నపూర్ణమ్మ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమా కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపిస్తోంది.
ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కి చేరువైందని సమాచారం. తొలి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 1.5 కోట్ల గ్రాస్, 91 లక్షల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అదే ఫామ్ కొనసాగించింది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉందని తెలిసింది. ఆదివారం సెలవురోజు కావడంతో పెద్దగా మార్పు కనిపించలేదు. మొత్తంగా మూడో రోజుకు గాను 1.6 కోట్ల నెట్, 2.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తొలి విక్ ఎండ్ ముగిసే సరికి 4.25 కోట్ల రాబట్టింది.
ఏరియాల వారిగా చూస్తే..
నైజాం- 56 లక్షలు, సీడెడ్- 29 లక్షలు, ఉత్తరాంధ్ర- 17 లక్షలు, తూర్పు గోదావరి- 10 లక్షలు, పశ్చిమ గోదావరి- 9 లక్షలు, గుంటూరు-16 లక్షలు, కృష్ణా- 14.4 లక్షలు, నెల్లూరు- 9 లక్షలు