YES BOSS: YES BOSS మూవీతో ఎంట్రీ ఇస్తోన్న యువ హీరో హవిష్
YES BOSS: పిల్ల జమీందర్ దర్శకుడు అశోక్ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల జోరు కంటిన్యూ అవుతోంది. యువతకు ఆకట్టుకునేలా ఇప్పటికే చాలా మంది యువ హీరోలు ఇంట్రెస్టింగ్ కథాంశాలతో హిట్లు సాధించారు. లేటెస్ట్‌గా మరో యువ కథానాయకుడు హవీష్ డిఫెరెంట్ కథాంశాలతో సినిమాల్లో నటించారు. నువ్విలా, సెవెన్ వంటి మూవీల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా యెస్ బాస్ అనే మూవీతో మరోసారి ఎంట్రీ ఇస్తున్నారు హవీష్. పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ డైరెక్షన్‌లో హవీష్ నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. హవీష్ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.