రజనీ మద్దతు కోరుతా : కమల్ హాసన్

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హసన్ అన్నారు. ఎన్నికల సమయంలో అందరి ఇళ్ళకి వెళ్తానని, అప్పుడు రజినీ ఇంటిని వదలిపెట్టనని అన్నారు.

Update: 2020-12-01 12:15 GMT

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హసన్ అన్నారు. ఎన్నికల సమయంలో అందరి ఇళ్ళకి వెళ్తానని, అప్పుడు రజినీ ఇంటిని వదలిపెట్టనని అన్నారు. తలైవాతో సినిమాల్లో పోటి తప్ప, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అటు IAS పదవికి రాజీనామా చేసిన సంతోష్ బాబు కమల్ పార్టీలో చేరారు. అనంతరం సంతోష్ బాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కమల్ హసన్. సంతోష్ బాబు తనకి ఇంకా ఎనిమిదేళ్లు సర్వీసు ఉన్నప్పటికీ IAS పదవికి రాజీనామా చేశారు. కమల్ హాసన్ 2018 ఫిబ్రవరి 21 న మదురైలో మక్కల్ నీధి మాయం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక 2021 ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

అటు రజినీకాంత్ పార్టీ విషయానికి వచ్చేసరికి తన పొలిటికల్ ఎంట్రీ పైన ఇంకా సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ వెళ్తున్నారు రజినీ. మక్కల్ మండ్రం పార్టీ నేతలతో నిన్నసమావేశమైయ్యరు తలైవా. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజినీ త్వరలోనే తన నిర్ణయం ఏంటో చేబుతానని వెల్లడించారు. తానూ ఎవరికీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా వారు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని రజినీకాంత్ వెల్లడించారు. ఈ భేటిలో వారి తరుపునుంచి లోటుపాట్లను నాకు తెలిపారని, నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నట్టుగా రజినీ వెల్లడించారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, తన పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆ పదవికి ఉత్తమ అర్హత కలిగిన వ్యక్తిని నామినేట్ చేస్తానని రజినీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News