Wild Dog Twitter Review: 'వైల్డ్ డాగ్'..ట్విట్టర్ రివ్వూ
Wild Dog Twitter Review: నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
Wild Dog Twitter Review: నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' అంటూ యాక్షన్ థ్రిల్లర్‌తో రంగంలోకి దూకారు. మరి ఆ అంచనాలను అందుకుందో లేదో ప్రీమియర్ షో చూసిన వాళ్లు ఏమంటున్నారో చూద్దాం..అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వైల్డ్ డాగ్' మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటించగా.. ఆయన సరసన దియా మీర్జా హీరోయిన్‌గా నటించారు. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే చిత్ర ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ 'వైల్డ్ డాగ్' మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పేసింది. విజయ్ వర్మగా నాగార్జున లుక్ అట్రాక్ట్ చేయడం, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించడంతో ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూశారు.
ఇక ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఎక్కడా కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ డైరెక్టర్ కథను నడిపించారని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అదరగొట్టేశారని, ఎస్కేపింగ్ సీన్ చాలా బాగా వచ్చిందని ట్వీట్స్ వస్తున్నాయి. సెకండాఫ్ కూడా కథను ఆసక్తికరంగా నడిపించారని, అసలు థ్రిల్లింగ్ అంటే ఏంటో ఈ సినిమా చివరి 20 నిమిషాల్లో చూడొచ్చనే టాక్ బయటకొచ్చింది. క్లైమాక్స్ సీన్స్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని ఆడియన్స్ అంటున్న మాట.
ఇక ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఎక్కడా కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ డైరెక్టర్ కథను నడిపించారని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అదరగొట్టేశారని, ఎస్కేపింగ్ సీన్ చాలా బాగా వచ్చిందని ట్వీట్స్ వస్తున్నాయి. సెకండాఫ్ కూడా కథను ఆసక్తికరంగా నడిపించారని, అసలు థ్రిల్లింగ్ అంటే ఏంటో ఈ సినిమా చివరి 20 నిమిషాల్లో చూడొచ్చనే టాక్ బయటకొచ్చింది. క్లైమాక్స్ సీన్స్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని ఆడియన్స్ అంటున్న మాట. అలాగే చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విజువల్స్ బాగున్నాయని, కాకపోతే ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీశారని ట్వీట్స్ వస్తున్నాయి. సో.. ఇప్పటివరకైతే ఇలా ఉంది.