ChatGPT: హిందీలో RRR రీమేక్.. రామ్‌గా రణ్వీర్.. భీమ్‌గా విక్కీ.. డైరెక్టర్ ఎవరంటే!?
RRR Hindi: హిందీలో RRR చేయాల్సి వస్తే ఎవరైనా బాగుంటుందో చాట్ బాట్ వివరణలతో పాటు నటీనటులను ఎంపిక చేసింది.
RRR Hindi: RRR మూవీతో దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి రుచి చూపించారు. ఆస్కార్ కొల్లగొట్టి తెలుగు సినిమా జెండాను ఎగరేశారు. కట్ చేస్తే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది..దర్శకుడు ఎవరైతే బాగుంటుంది..నటీనటులు ఎవరు అనే విషయంపై చాట్ జీపీటీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా పని చేసే ఈ చాట్ బాట్ నుంచి వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
RRR మూవీలో ముందుగా చెప్పుకోవాల్సిన పాత్ర రామరాజు అలియాస్ అల్లూరి సీతారామరాజు. బ్రిటీష్ వారివద్దే పని చేస్తూ వారిపై తిరుగుబాటు చేసేందుకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకునే పోలీస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించారు. ఈ పాత్రలో చరణ్ జీవించాడు. ఈ పాత్రను హిందీలో చేస్తే ఎవరు చేయాలనే ప్రశ్నకు చాట్ జీపీటీ రణవీర్ సింగ్ ను ఎంచుకుంది. రామరాజు పాత్రకు రణవీర్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పింది. గతంలో ఆయన చేసిన పవర్ ఫుల్ పాత్రలే అందుకు నిదర్శనం అని తేల్చింది. అయితే ఇదే రోల్ కు సెకండ్ ఛాయిస్ గా సిద్ధార్థ్ మల్హోత్రను కూడా సెలక్ట్ చేసుకుంది.
ఇక కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరం చూశాం.ఎన్టీఆర్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు జాతికి కాపరిలా కనిపించిన ఎన్టీఆర్ పాత్రకు చాట్ జీపీటీ హిందీలో విక్కీ కౌశల్ ను ఎంచుకుంది. అలాగే రాజ్ కుమార్ రావును కూడా ఛూజ్ చేసుకుంది. వైవిధ్యభరిత పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావు వీళిద్దరిలో ఎవరైనా భీమ్ క్యారెక్టర్ కు న్యాయం చేయగలరని తేల్చి చెప్పింది.
రామరాజు మరదిలిగా సీత పాత్రలో ఆలియా నటించింది. ఈమె తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా తన మార్క్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ ను హిందీ వెర్షన్ లో శ్రద్ధాకపూర్ నటిస్తే బాగుంటుందని చాట్ బాట్ సూచించింది. సెకండ్ ఛాయిస్ గా కృతిసనన్ కు ఓటు వేసింది. ఇక రామరాజు తండ్రి అల్లూరి వెంకటరామరాజు క్యారెక్టర్ కు రాజమౌళి బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను ఎంచుకుంటే ఆయన స్థానంలో చాట్ బాట్ సంజయ్ దత్త్ వైపు మొగ్గుచూపింది. అలాగే అనీల్ కపూర్ కూడా ఓకే అని సూచించింది.
RRR చిత్రంలో మరో కీలకమైనది వెంకటరామరాజు భార్య పాత్ర. ఈ పాత్రను శ్రియ శరన్ పోషించారు. అయితే చాట్ బాట్ మాత్రం వెంకటరామరాజు భార్య క్యారెక్టర్ కోసం శ్రియ స్థానంలో దీపికా పదుకొణె పేరును సెలక్ట్ చేసింది. ఇందుకు వివరణ కూడా ఇచ్చింది. పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి పలు చిత్రాల్లో దీపిక బలమైన నాయికా పాత్రలను పోషించిందని గుర్తు చేసింది. ఇక చివరిగా దర్శకుడు విషయానికొస్తే...రాజమౌళి స్థాయిలో RRR చిత్రాన్ని హిందీలో తీయాల్సి వస్తే అంత సత్తా ఉన్న దర్శకుడు ఎవరు అని అడగ్గా...బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని ఎంపిక చేసింది. ఇలా, హిందీలో RRR చేయాల్సి వస్తే ఎవరైనా బాగుంటుందో చాట్ బాట్ వివరణలతో పాటు నటీనటులను ఎంపిక చేసింది. అయితే ప్రతి పాత్రకు ఇద్దరిని సెలక్ట్ చేసిన చాట్ బాట్..దర్శకుడి విషయంలో మాత్రం ఒక్కరినే ఎంచుకోవడం విశేషం...రాజమౌళికి సాటి వచ్చేలా సినిమాలు తీయగల సత్తా కేవలం సంజయ్ లీలా భన్సాలీకి మాత్రమే ఉందని AI చాట్ బాట్ చెప్పకనే చెప్పినట్లయింది.