Malaika Arora: సూసైడ్ చేసుకునే ముందు మలైకా అరోరా తండ్రి ఆమెకు ఏం చెప్పాడు?

Update: 2024-09-12 08:55 GMT

Malaika Arora's Father Suicide: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. వృద్ధాప్య జీవితం గడుపుతోన్న అనిల్ కుల్దీప్ మెహతాకు ఉన్నట్లుండి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందనేదే ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖులను, చిత్రసీమ పరిశీలకులను అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అది కూడా బిల్డింగ్ ఎక్కి మరీ కిందకు దూకి చనిపోయే దుస్సాహం చేసేంత పెద్ద కష్టం ఏమొచ్చిందనేదే అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం మలైకా అరోరా తండ్రి చనిపోయిన షాక్ లో ఉంది. ఆమె ఇంకా ఆ కష్టం నుండి తేరుకోలేదు.

మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య తరువాత మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తుండటంతో మలైకా అరోరానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. నాన్న చనిపోయారు అని చెప్పడం చాలా బాధగా ఉంది. ఆయన చాలామంచి మనిషి. మాతో, పిల్లలతో చాలా సరదాగా ఉండేవారు. అమ్మతోనూ ప్రేమగా ఉండేవారు. అందుకే నాన్న ఇక లేరంటే మేం తట్టుకోలేకపోతున్నాం. ఈ కష్టకాలంలో మా కుటుంబం పరిస్థితి అర్థం చేసుకుని మాకు సహకరించండి అంటూ మలైకా అరోరా ఆ పోస్టులో విజ్ఞప్తి చేశారు.

అనిల్ మెహాతా సూసైడ్ అనంతరం ముంబై పోలీసులు జరిపిన విచారణలో భాగంగా అనిల్ భార్య జాయిసి పాలికార్ప్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భర్త అనిల్ మెహతా ఆత్మహత్య చేసుకున్నప్పుడు తాను ఇంట్లోనే ఉన్నాను. బుధవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆయన కోసం వెతుకుతూ లివింగ్ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఆయన కనిపించలేదు కానీ ఆయన చెప్పులు అక్కడే విప్పేసి ఉండటం కనిపించింది. చెప్పులు ఇక్కడే విప్పేసి ఎక్కడికెళ్లాడా అని ఇల్లంతా వెతుకుతున్నాను. బాల్కనీలో కూడా కనిపించలేదు. అంతలోనే బయట అంతా ఏదో గోలగోలగా శబ్ధం వినిపించింది. ఇంటి బయట ఉన్న సెక్యురిటీ గార్డ్ సహాయం కోసం అరుస్తుండటం వినిపించింది. అతడి అరుపులు వింటూనే ఏదో భయం అనిపించింది. ఆ తరువాతే అసలు విషయం తెలిసింది అని జాయిసి పోలీసులకు వెల్లడించినట్లుగా ఐఏఎన్ఎస్ కథనం పేర్కొంది.

అంతేకాకుండా అనిల్ మెహతా సూసైడ్ చేసుకోవడానికి ముందుగా తన ఇద్దరు కూతుళ్లయిన మలైకా అరోరా, అమృత అరోరాలకు ఫోన్ చేశారని.. తాను ఇక అలసిపోయానని వారితో బాధతో చెప్పారని ఆ కథనం స్పష్టంచేసింది.

అనిల్ మెహతా సూసైడ్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు చాలామంది వారి ఇంటికి చేరుకుని ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. ఈ ఘటన జరిగిందని తెలిశాకా ముందుగా మలైకా అరోరా.. ఆ తరువాత ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. ఆ తరువాత చిన్న కూతురు అమృత అరోరా తన భర్త షకీల్ లడఖ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. విషాదంలో ఉన్న మలైకా అరోరా కుటుంబానికి అండగా నిలిచేందుకు సల్మాన్ ఖాన్, అతడి తండ్రి, బాలీవుడ్ సీనియర్ రచయిత సలీం ఖాన్ కూడా మలైకా ఇంటికి వెళ్లారు. 

Tags:    

Similar News