మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. కంగనా!
President Rule In Maharashtra : కంగనా రనౌత్.. బాలీవుడ్ లో కాకుండా మహారాష్ట్రలో మోస్ట్ హాట్ టాపిక్.. ఎక్కడ చూసిన ఇప్పుడే ఈమె పేరు వినిపిస్తుంది.
President Rule In Maharashtra : కంగనా రనౌత్.. బాలీవుడ్ లో కాకుండా మహారాష్ట్రలో మోస్ట్ హాట్ టాపిక్.. ఎక్కడ చూసిన ఇప్పుడే ఈమె పేరు వినిపిస్తుంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పైన, మరియి ముంబై పోలిసుల పైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా ముంబైని పీవోకే తో పోల్చడం శివసేన నేతలకి నచ్చలేదు.. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ క్రమంలోని ముంబైలోని ఆమె కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బీఎంసీ అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. దీనితో కంగనా మహా సర్కార్ పై మరింతగా విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది.
'కరోనా వల్ల మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటే.. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోవడం మానేసి, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడమే పనిగా పెట్టుకుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి' అని ట్వీట్ చేసింది. అంతకుముందు ఫెమినిస్టులపై (స్త్రీ వాదులపై) కంగనా మండిపడింది. తాను ఈ కేసులో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై గెలుస్తానని, బీఎంసీ నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా విశ్వాసం వ్యక్తం చేసింది. కంగనా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక కంగనా సెప్టెంబర్ 9న ముంబయికి వచ్చారు. తిరిగి సెప్టెంబర్ 14 న హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్ళారు.