Tollywood Trend: టాలీవుడ్ లో వింటేజ్ మానియా

మన టాలీవుడ్ లో ఇప్పుడు వింటేజ్ మానియా మొదలైంది. పిరియాడిక్ మూవీస్ కోసం మన హీరోహీరోయిన్లు వింటేజ్ లుక్ లో కనిపించి ఆకట్టుకోగా ఇప్పుడు కమర్షియల్ మూవీస్ లో కూడా వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నారు.

Update: 2023-06-01 13:15 GMT

Tollywood Trend: టాలీవుడ్ లో వింటేజ్ మానియా

Tollywood Heroes: మన టాలీవుడ్ లో ఇప్పుడు వింటేజ్ మానియా మొదలైంది. పిరియాడిక్ మూవీస్ కోసం మన హీరోహీరోయిన్లు వింటేజ్ లుక్ లో కనిపించి ఆకట్టుకోగా ఇప్పుడు కమర్షియల్ మూవీస్ లో కూడా వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ మూవీలో వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ లో కనిపించి హిట్టు కొట్టిన విషయం మనకు తెలిసిందే. మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ వింటేజ్ లుక్ లో కనిపించారు, అలాగే ఇదే సినిమాలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ కూడా దర్శనం ఇచ్చారు. పవన్ తొలిప్రేమలో, యమదొంగలో ఎన్టీఆర్, ఎందుకంటే ప్రేమంటే చిత్రంలో రామ్, తమన్నా, మహర్షిలో మహేష్ బాబు, రణరంగంలో శర్వానంద్, కల్యాణి ప్రియ, కంచె చిత్రంలో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైశ్వాల్, నిప్పు చిత్రంలో రవితేజా, శ్రీరామ్, బావ సినిమాలో సిద్ధార్థ్, స్నేహమేరా జీవితంలో శివబాలాజీ, రాజీవ్ కనకాల..ఇలా పలువురు నటీనటులు సన్నివేశాల్లో, పాటల్లో వింటేజ్ లుక్ లో కనిపించారు.

ఈ వింటేజ్ ట్రెండ్ మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో టాలీవుడ్ లో కొత్త హైట్స్ కు చేరింది. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి వింటేజ్ లుక్ కేవలం మెగా అభిమానులనే కాకుండా, సినీ అభిమానులను సైతం అలరించింది. ఇదే ఊపులో తన నెక్ట్స్ మూవీ భోళా శంకర్ లో సైతం మెగా స్టార్ వింటేజ్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన స్టిల్స్ లో గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్ గా వింటేజ్ లుక్ లో కనిపించాడు.

పవన్ కల్యాణ్ సైతం తన ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాల్లో వింటేజ్ లుక్ లో దర్శనం ఇవ్వడం ఖాయంగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్ లో పవన్ వింటేజ్ మాస్ ట్రీట్ ఇచ్చాడు. గ్లింప్స్ లో పవన్ మార్క్ స్వాగ్ కొట్టొచ్చినట్లు కనిపించింది. OGలో సైతం పవన్ వింటేజ్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అయ్యారు. ఇక తాజాగా రిలీజైన గుంటూరు కారం గ్లింప్స్ లో కూడా మహేష్ వింటేజ్ లుక్ లో కనిపించి ఘట్టమనేని ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చాడు. తన పాత సినిమాల్లో ఉన్నట్లు గుంటూరు కారంలో వింటేజ్ మార్క్ ని మహేష్ చూపించాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వింటేజ్ హవా నడుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది స్టార్ హీరోలు ఇదే స్టైల్ లో దర్శనం ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. మాస్ రాజా రవితేజా తన టైగర్ నాగేశ్వరరావు మూవీలో వింటేజ్ లుక్ లో కనిపించడం గ్యారెంటీ. మొత్తానికి, టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ వింటేజ్ లుక్ లో కనిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టేందుకు వచ్చేస్తున్నారు.

Tags:    

Similar News