Maharaja OTT: ఓటీటీలో రచ్చ చేస్తున్న మహారాజ.. అరుదైన రికార్డ్ నమోదు..!

Maharaja Movie OTT: విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-16 06:42 GMT

Maharaja: ఓటీటీలో రచ్చ చేస్తున్న మహారాజ.. అరుదైన రికార్డ్ నమోదు..!

Maharaja Movie: విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 14 వ తేదీన తమిళం తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 110 కోట్లకు పైగా రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది.

కాగా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న మహారాజ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 12వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సంచలన విజయం నమోదు చేసుకున్న మహారాజ ప్రస్తుతం ఓటీటీలో సత్తా చాటుతోంది. నెట్‍ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ఇండియా ట్రెండింగ్ చిత్రాల్లో ప్రస్తుతం టాప్‍కు చేరింది. ఈ చిత్రం మరిన్ని రోజులు హవా కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉత్కంఠతో రూపొందిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటనకు ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ టేకింగ్, స్క్రీన్‍ప్లే అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేకే నగర్‌లో సెలూనే షాప్‌ నిర్వహించే వ్యక్తిగా కనిపించే విజయ్‌సేతుపతి.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్‌ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరో సస్పెన్స్‌లో పెడుతూ సాగుతున్న సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News