అది వేరు.. ఇది వేరు..

Update: 2020-11-06 03:40 GMT

తమిళనటుడు ఇళయ దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అభిమానులు కలిసినా.. అభ్యర్థనలు పెట్టినా.. ఆయనెప్పుడూ దీనిమీద స్పందించలేదు. ఐతే ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రచారం ఇప్పుడు పీక్స్‌కు చేరింది. ఎక్కడివరకు అంటే పార్టీ పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నారని అనేంత ! దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అయింది. ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్ ఇయక్కం పేరుతో విజయ్‌ అభిమానులు ఈసీలో కొత్త పార్టీని నమోదు చేయడంతో హీరోనే పార్టీ పెట్టారంటూ తమిళనాట సోషల్‌మీడియాలో జోరుగా చర్చలు జరిగాయ్.

ఐతే ఈ ప్రచారాన్ని విజయ్ సన్నిహితులు ఖండించారు. విజయ్‌ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ఆయన తండ్రి చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చాలని అభిమానులు కోరుతున్నారన్నారు. విజయ్‌ మక్కల్ ఇయక్కంను ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కంగా నమోదు చేశారని తెలిపారు. ఇది పూర్తిగా అభిమానుల కోరిక మేరకు జరిగిందన్నారు. మరోవైపు విజయ్‌ కూడా దీనిపై స్పందించారు. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News