Vijay Deverakonda on Covid -19: విజయ్ దేవరకొండ కరోనా సలహాలు

Vijay Deverakonda on Covid -19: తెలంగాణ సర్కార్ ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించడానికి హీరో విజయ్ దేవరకొండ సాయం తీసుకున్నారు.

Update: 2021-05-08 00:13 GMT

Vijay Deverakonda:(File Image) 

Vijay Deverakonda on Covid -19: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. దేశంలో లక్షలసంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా... వందల సంఖ్యల్లో మరాణాలు సంభవిస్తున్నాయి. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కరోనా నుంచి కోలుకున్నారు. ఇపుడిపుడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించడానికి హీరో విజయ్ దేవరకొండ సాయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఎవరికైనా కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక పైన చెప్పిన వాటిలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే అక్కడ డాక్టర్లను సంప్రదించి మందులు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని రిజల్డ్ వచ్చే వరకు ఎంతో టైమ్ పడుతోంది. దీని వల్ల పేషెంట్‌కు ఎంతో నష్టం జరుగుతోంది. సీరియస్ అవుతోంది. అందుకే కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు కనిపించగానే.. వెంటనే ఆయా హాస్పిటల్‌లో డాక్టర్ల సలహా మేరకు తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మందుల కిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News