Chiru 154th Movie: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "లైగర్" చిత్రంతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రౌడీ బాయ్ ఈ సినిమా తర్వాత వరుసగా మరో రెండు సినిమాలతో మరో ఏడాది వరకు వరుస షూటింగ్ లతో బిజీ బిజీగా గడపనున్నాడు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు బాబీ.. విజయ్ దేవరకొండ కోసం ఒక కథని సిద్ధం చేసి ఆ కథని విజయ్ దేవరకొండకి కూడా వినిపించాడు. ఆ కథ నచ్చిన విజయ్ దేవరకొండకి తన షూటింగ్ కి కాల్ షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ సినిమాని వదులుకున్నాడు. ఇప్పుడు అదే కథలో కొంత మార్పులు చేసి మెగాస్టార్ చిరంజీవికి వినిపించగా చిరు ఆ సినిమాకి ఓకే చెప్పేశాడు.
ఇక చిరు "ఆచార్య" సినిమాతో పాటు "లూసిఫార్" రీమేక్ ల షూటింగ్ బిజీగా ఉన్న చిరు ఆ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు 154వ చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నవాజుద్దిన్ సిద్దిఖి విలన్ గా నటించబోతున్నాడు. ఇప్పటికే దక్షిణాది సినిమాలో "పెట్టా" సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన నవాజుద్దిన్ సిద్దిఖి ఇప్పుడు చిరు సినిమాలో మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక విజయ్ కి ఖాళీ లేక వదులుకున్న సినిమాని చిరు చేస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే మొదలుకానుంది.