Vijay Devarakonda honors plasma donor donors : ప్లాస్మా డొనేట్ దాతలను సన్మానించిన విజయ్ దేవరకొండ!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది.. ఇక భారత్ లో కూడా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
Vijay Devarakonda honors plasma donor donors : కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది.. ఇక భారత్ లో కూడా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లు తమ ప్లాస్మాను ఇచ్చి కోవిడ్ బారినా పడిన వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందని చాలా మంది చెబుతున్నారు.. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది కరోనా బాధితులకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్మాను డొనేషన్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇక సినీ యాక్టర్స్ కూడా దీనీ ప్రాముఖ్యతని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
అయితే కరోనా నుంచి కోలుకోని కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందించారు. ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడవచ్చుని అయితే ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారని దీనితో 200 మంది రోగులను కాపాడామని అన్నారు. అంతేకాకుండా ప్లాస్మా దానం చేసిన వారు కరోనా యోధులని వాళ్ళు దేవుడితో సమానమని అన్నారు. అటు ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ను హీరో విజయ్ దేవర కొండ ఆవిష్కరించారు.