vidyullekha raman Success story: అప్పుడు హేళనలు..ఇప్పుడు అభినందనలు..ఇది విద్యుల్లేఖ విజయం!

vidyullekha raman Success story: తమిళ నటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది నటి విద్యుల్లేఖ రామన్‌... రాజు గారి గది, మహర్షి, వెంకీ మామ మొదలైన చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి..

Update: 2020-06-27 16:44 GMT

vidyullekha raman Success story: తమిళ నటి అయినప్పటికీ తనదైన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది నటి విద్యుల్లేఖ రామన్‌... రాజు గారి గది, మహర్షి, వెంకీ మామ మొదలైన చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి.. అయితే సినిమాల్లో ఎక్కువగా బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ తాజాగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది.. తాజాగా ఆమె బరువు తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే తాను ఎలా బరువు తగ్గింది? దానికి ఎటువంటి కసరత్తులు చేసింది అనే దానిపై ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది విద్యుల్లేఖ..

" నన్ను నేను మలచుకోవాలి అనుకున్న ఆలోచన నుంచి ఇది జరిగింది.. నేను చిరుతిళ్లు అంటే బాగా ఇష్టపడేదాన్ని..దీనితో పాటు నాకు పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌) అనే సమస్య వచ్చింది..దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను..దీంతో ఏ పని పైన కూడా శ్రద్ద పెట్టేదాన్ని కాదు.. వైద్యులు కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో నాలో భయం మొదలైంది. అప్పుడు ఎలాగైనా బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నాను..నేచురోపతి, ఆయుర్వేద, యోగాలను ఉపయోగించి బరువు తగ్గడం మొదలు పెట్టాను.. అంతేకాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేదాన్ని .. ఈ విషయంలో నాకు నా ట్రైనర్‌ నవీన్‌ ఎంతో సహాయం చేశారని "విద్యుల్లేఖ వెల్లడించారు..

ఇక మొదట్లో సినిమా ల్లో నేను లావుగా ఉండడంతో నాకు కోసం ప్రత్యేకంగా కామెడీ పాత్రలు రాసేవారని అయితే వాటిని నేను ఎప్పుడు వ్యక్తిగతంగా తీసుకోలేదని అన్నారు.. ఇక తెర వెనుక కూడా నా బరువు పైన విమర్శలు చేశారు కానీ అప్పట్లో వాటి గురించి మాట్లాడే దైర్యం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.. ఒక్కప్పుడు నన్ను చూసి హేళన చేసినవారే ఇప్పుడు నన్ను మెచ్చుకోవడం సంతోషాన్ని ఇస్తుందని అన్నారు.. జనవరిలో 77కేజీల ఉన్న నేను జూన్‌ నాటికి 68 కిలోలకు తగ్గనని ప్రస్తుతం నేను ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉన్నానని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు..ఇక విద్యుల్లేఖ రామన్ ప్రస్తుతం తమిళ్ , తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..


Tags:    

Similar News