Sherni Movie Review: షేర్నీ మూవీ రివ్యూ
Sherni Movie Review: షేర్నీ మూవీలో కంటెంట్ బోలెడంత ఉన్నా.. ఆసక్తికరంగా తీయడంలో మాత్రం దర్శకుడు కమర్షియల్ గా ఫలమయ్యాడనే టాక్ వినిపిస్తోంది.
Sherni Movie Review: అడవి.. అడవిలో జంతువులు.. మనుషులు.. వారందరినీ కాపాడేవారు కొందరైతే.. వారిని ఉపయోగించుకుని లాభపడేవారు మరికొందరు.. వీరందరి మధ్య అడవిలో ఎలాంటి తతంగాలు నడుస్తున్నాయో.. ఒక ఫ్యాక్టోరియల్ మూవీగా షేర్నీ రూపొందింది.
కథ విషయానికొస్తే...
మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతానికి విద్యా విన్సెంట్(విద్యా బాలన్) డీఎఫ్‌ఓ(డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్)గా వెళ్తుంది. అదే అడవిలో రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తిస్తారు. వాటిలో టీ12 అనే ఓ పులి మనుషులపై దాడి చేసి చంపేస్తుంటుంది. విద్య తన సిబ్బందితో కలిసి ఆ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటంతో పులి దాడిని రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటారు. మరి చివరకు పులిని విద్య పట్టుకుందా? రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి పని చేశారు? తెలియాలంటే 'షేర్నీ' చూడాల్సిందే!
ఎలా ఉందంటే: షేర్నీ..
ఆడపులి.. ఈ సినిమా ఒక డాక్యుమెంటరీలా నడిచింది. కంటెంట్ బోలెడంత ఉన్నా.. ఆసక్తికరంగా తీయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. ఎన్ని చూపించినా చివరకు హీరో లేదా హీరోయిన్ విజయం సాధించాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు.. లేదంటే ఇగో దెబ్బ తింటుంది. ఈ సినిమా ఆ విషయంలో ఫెయిల్ అయింది. కాకపోతే వాస్తవాలను వాస్తవాలుగా చూపించి.. బయట చివరకు ఏం జరుగుతుందో అదే చూపించాడు. ఇదే కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.
విద్యా విన్సెంట్‌గా అటవీశాఖ అధికారి పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయింది. ఇటు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, అటు కుటుంబంలో వచ్చే ఒత్తిడులను మధ్య నలిగిపోయే సగటు మహిళగా చక్కని హావభావాలు పలికించింది. కాని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండాల్సినంత యాక్టివ్ గా మాత్రం ఎక్కడా కనపడదు. బాడీ లాంగ్వేజ్ ఎక్కడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ లా ఎక్కడా కనపడలేదు. బ్రిజేంద్ర కాలా కామెడీ నవ్వులు పూయిస్తుంది.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. బెనిడిక్ట్ టేలర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది.
రాకేశ్ హరిదాస్ అడవి అందాలను తన కెమెరాతో చక్కగా చూపించాడు. అడవిలో జీపు ప్రయాణం, రాత్రి సన్నివేశాలు ఉత్కంఠగా తీర్చిదిద్దదాడు. దీపికా కల్రా ఎడిటింగ్ బాగుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు నిడివి తగ్గిస్తే బాగుండేది. రాజ్‌కుమార్ రావ్‌తో 'న్యూటన్' లాంటి విభిన్న కథను తీసిన వి.మసర్కర్ మహారాష్ట్ర యవత్మాల్‌లో జరిగిన 'అవని' ఘటనను ఆధారంగా తీసుకుని 'షేర్నీ' తీర్చిదిద్దారు. 2018లో జరిగిన ఈ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అవని ఘటన సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. అయితే, కేవలం ఆ ఘటననే కాకుండా, సమాజంలో మహిళులు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు మసర్కర్.
నటీనటులు...
విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ తదితరులు; సంగీతం: బందిష్ ప్రొజెక్ట్, ఉత్కర్ష్ ధోతేకర్; నేపథ్య సంగీతం: బెనిడిక్ట్ టేలర్, నరేన్ చందవర్కర్; సినిమాటోగ్రఫీ: రాకేశ్ హరిదాస్; ఎడిటింగ్: దీపికా కల్రా; నిర్మాత: భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, విక్రమ్ మల్హోత్ర, అమిత్ వి. మసర్కర్; దర్శకత్వం: అమిత్ వి. మసర్కర్