Viraaji: 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రెండ్ అవుతోన్న సినిమా.. ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకుంటున్న 'విరాజి' చిత్రం..

వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం విరాజి. ఈనెల రెండవ తేదీన థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

Update: 2024-08-23 12:45 GMT

వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం విరాజి. ఈనెల రెండవ తేదీన థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది. నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ - "విరాజి" సినిమాను ఈ నెల 2న థియేట్రికల్ రిలీజ్ చేశాం. ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్ కు మా మూవీ రీచ్ కాలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నాం. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉంది. "విరాజి" సినిమా విషయంలో హీరో వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేశారు. ఏమాత్రం ఆటిట్యూడ్ లేని పర్సన్ మా హీరో. మంచి చిత్రం అందించిన మా దర్శకుడికి థాంక్స్" అని తెలిపారు

ఇక నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ - "విరాజి" సినిమాను థియేటర్స్ లో ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను చేసిన రోల్ కు మంచి గుర్తింపు దక్కింది. ఆహాలో మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు" అన్నారు.

ఇక హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఈ రోజు "విరాజి" సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రేండింగ్ లో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారి పుట్టినరోజు. సో ఇది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. మహేంద్రనాథ్ గారు మా మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్టు 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నారు" అని తెలిపారు.

Tags:    

Similar News