Samantha: టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

Samantha: సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి.

Update: 2024-11-21 11:12 GMT

Samantha: టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

Samantha: సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. అంతేకాని ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చొకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే.. సంకల్పాన్ని మాత్రం వీడొద్దు. అప్పుడు మనల్ని నిందించేవారికి సరైన సమాధానం చెప్పొచ్చు అని సామ్ చేసిన పోస్ట్‌లో రాసి ఉంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ మాటలు తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయని సమంత పేర్కొన్నారు.

నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధిబారినపడి చాలా ఇబ్బంది పడినట్లు సమంత ఇటీవల చెప్పారు. మయోసైటిస్ వ్యాధి శరీరంగా, మానసికంగా చాలా బలహీనం చేసినట్లు తెలిపారు. కానీ వాటనింటిని అధిగమించి మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యానన్నారు. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్ని ప్రమోషన్స్ లో పాల్గొని మాట్లాడుతూ సమంత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎదుర్కొన్న ఆ ఇబ్బందులను ఇన్‌డైరెక్టుగా ఈ పద్యం ద్వారా సమంత చెప్పకనే చెప్పింది.

నలుగురిని ఇన్‌స్పైర్ చేసేలా ఉన్న ఈ పోస్ట్ సంగతి ఎలా ఉన్నా.. మరికొద్దిరోజుల్లోనే నాగచైతన్య, శోభిత వివాహం చేసుకోనున్న నేపథ్యంలో సమంత పెట్టిన పోస్ట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. సమంతతో విడిపోయిన తరువాత చైతూ రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ పెట్టడం వెనుకున్న అర్థం ఏంటని కొంతమంది నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. తన సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ బ్యానర్‌పైనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా డైరెక్టర్, ఇతర విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. మరోవైపు సమంత నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్ని ప్రస్తుతం అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి టాక్ వచ్చింది.


Tags:    

Similar News