Vanitha Vijayakumar : న‌టి వనిత విజయ్ కుమార్ భ‌ర్తకు గుండె పోటు!

Vanitha Vijayakumar : తమిళ నటి విజయ్ కుమార్ భ‌ర్త పీట‌ర్ పాల్ గుండెపోటుకు గుర‌య్యారు. దీనితో తన భర్త పీటర్‌ పాల్‌ను హాస్పిటల్‌లో చేర్పించామని ఆమె

Update: 2020-08-27 08:09 GMT

Vanitha Vijayakumar

Vanitha Vijayakumar : తమిళ నటి విజయ్ కుమార్ భ‌ర్త పీట‌ర్ పాల్ గుండెపోటుకు గుర‌య్యారు. దీనితో తన భర్త పీటర్‌ పాల్‌ను హాస్పిటల్‌లో చేర్పించామని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పీట‌ర్ పాల్ త్వరగా కోలుకోవాలని వనితా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపైన వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ " చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితం చాలా క‌ష్టమైంది. మ‌న లైఫ్‌లో జ‌రిగే ప్రతీది ఏదో ఒక కార‌ణంతోనే జ‌రుగుతుంద‌ని నేను న‌మ్ముతాను. ప‌రిస్థితులు అన్ని స‌ర్దుకుంటాయి" అని ఆమె పోస్ట్ చేశారు..

సీనియ‌ర్ న‌టులు మంజుల‌-విజ‌య్ కుమార్ దంప‌తుల పెద్ద కుమార్తే వ‌నిత‌.. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దేవి సినిమాలో నటించింది.. కొన్ని రోజుల క్రితం ఆమె పీట‌ర్ పాల్‌ను క్రిస్టియ‌న్ సంప్రదాయం ప్రకారం మూడో పెళ్లి చేసుకున్నారు.. దీనికి ఆమె ఇద్దరు కూతుళ్ళు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.. అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితా విజయ్ కుమార్‌ను పీట‌ర్ పాల్‌ పెళ్లి చేసుకోవడం పెద్ద వివాదానికి దారి తీసింది.

2000వ సంవత్సరంలో న‌టుడు ఆకాశ్‌ను ఆమె మొద‌టి పెళ్లి చేసుకోగా, వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. కొద్ది రోజుల తర్వాత మనస్పర్ధలతో వీరు 2005లో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత ఆమె 2007లో ఆనంద్ జ‌య‌ద‌ర్శన్ అనే బిజినెస్ మెన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. తాజాగా ఆమె పీట‌ర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.  

Tags:    

Similar News