Upasana: నాకు, క్లీంకారకు మధ్య ఓ కామన్ పాయింట్ చెప్పండి మామయ్యా? కోడలి ప్రశ్నకు తడబడిన చిరంజీవి..
Upasana: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్ధు ప్రధానం చేశారు.
Upasana: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్ధు ప్రధానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. అవార్డు తీసుకోవడానికి ముందు చిరంజీవి... ఆయన కోడలు ఉపాసన మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
‘మావయ్య.. క్లీంకారకు, నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి?’ అని చిరంజీవిని ఉపాసన అడగ్గా.. ‘క్లీంకార నీకు ప్రతిరూపం’ అని సమాధానమిచ్చారు. దానికి ఉపాసన.. 'కాదు, మామయ్యా... కామన్ పాయింట్ ఏమంటే మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చింది' అని ఉపాసన సమాధానం చెబుతారు. దానికి చిరంజీవి స్పందిస్తూ... అవును... వీసీ రెడ్డి గారు, నేను... అవును అని నవ్వేశారు. ఉపాసన తాత ప్రతాప్ సి. రెడ్డికి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో చిరంజీవి, ఉపాసనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు.