Upasana Kamineni: బాడీ షేమింగ్ గురించి రియాక్ట్ అయిన రామ్ చరణ్ భార్య

Upasana Kamineni: బాడీ వెయిట్ గురించి వచ్చిన ట్రోల్స్ పై రియాక్ట్ అయిన ఉపాసన

Update: 2023-04-03 05:49 GMT

Upasana Kamineni: బాడీ షేమింగ్ గురించి రియాక్ట్ అయిన రామ్ చరణ్ భార్య 

Upasana Kamineni: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలిగా మాత్రమే కాక అపోలో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉపాసన కామినేని కొనిదెలా కి మంచి పేరు ఉంది. రామ్ చరణ్ తో పెళ్లి అయిన మొదట్లో ఉపాసన మీద చాలా మంది అభిమానులు ట్రోల్ చేశారు. వెయిట్ కారణంగా ఆమెను చాలా మంది బాడీ షేమింగ్ చేశారని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అప్ అయ్యారు ఉపాసన.

"నా వెయిట్ మరియు బాడీ షేప్ గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేసే వారు. అది నా మెంటల్ హెల్త్ ని కూడా డిస్టర్బ్ చేసింది," అని అన్న ఉపాసన మొదట్లో ఈ నెగెటివిటీని హ్యాండిల్ చేయటం తనకి చాలా కష్టమైందని కానీ సమయంతో పాటే వాటిని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్నానని చెబుతోంది ఉపాసన. ఎదుటివారు తన గురించి ఏమంటున్నారు అని ఆలోచించటం కంటే తన హెల్త్ గురించి ఆలోచించడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు ఉపాసన.

ఇలా సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కి గురై ఇబ్బందులు పడ్డ వారిలో ఉపాసన మొదటి వ్యక్తి కాదు. కెమెరా ముందు కనిపించే ప్రతి సెలబ్రిటీ ఏదో ఒక సమయంలో ఇలాంటి ట్రోలింగ్ కి గురై ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ కారణాల వల్ల కొంచెం వెయిట్ పెరిగినా కూడా వారి మీద సోషల్ మీడియాలో నెగిటివిటీ మొదలైపోతుంది. దీని గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు నోరు పెట్టారు. తాజాగా ఇప్పుడు ఉపాసన కూడా దీని గురించి రియాక్ట్ అయ్యి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Tags:    

Similar News