థియేటర్లు రీఓపెన్ .. రూల్స్ ఇవే!

Cinema Halls, Multiplexes To Reopen : అన్ లాక్ 5.0లో భాగంగా కేంద్రం అక్టోబర్ 15 నుంచి ధియేటర్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Update: 2020-10-06 07:17 GMT

cinema halls

Cinema Halls, Multiplexes To Reopen : అన్ లాక్ 5.0లో భాగంగా కేంద్రం అక్టోబర్ 15 నుంచి ధియేటర్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. 50% మించి థియేటర్లలో ప్రేక్షకులను అనుమతించవద్దంది. థియేటర్లలో భౌతికదూరం పాటించాలని, ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలంది. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కరోనా లక్షణాలులేని ప్రేక్షకులను మాత్రమే ధియేటర్ లోకి అనుమతించాలంది.

ఇక సినిమా హాళ్ళలో ప్రేక్షకులు ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని వెల్లడించింది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు రోజు మొత్తం ఓపెన్ చేసి ఉంచాలంది. ఇక సినిమాకి ముందు లేదా బ్రేక్ సమయంలో కరోనా గురించి అవగాన కల్పించే విధంగా నిమిషం నిడివితో ఉన్న ప్రకటనను వేయాలని సూచించింది. ప్యాకేజీ చేసిన ఆహారపానీయాలు మాత్రమే అనుమతించబడతాయని వెల్లడించింది. అలాగే, ఆరోగ్య సేతు యాప్ ను తప్పక వాడాలని సూచించింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని లేనిచొ చర్యలు తప్పవని పేర్కొంది.

ఇక దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో కేంద్రం లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో అన్నీ ఎక్కడికక్కడ స్తభించిపోయాయి. అందులో ధియేటర్లు కూడా ఉన్నాయి.. మార్చి చివరి వారంలో మూతపడిన ధియేటర్లు దాదాపుగా ఆరు నెలల తర్వాత రీఓపెన్ అవుతున్నాయి. ఇక ఈ సమయంలో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తూ వచ్చారు.


Tags:    

Similar News