మార్కెట్ తో సంబంధం లేకుండా థియేట్రికల్ బిజినెస్ చేస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలు

* భారీ నాన్ తీయట్రికల్ బిజినెస్ లు చేస్తున్న నాని మరియు విజయ్ దేవరకొండ సినిమాలు

Update: 2023-03-08 09:46 GMT

మార్కెట్ తో సంబంధం లేకుండా థియేట్రికల్ బిజినెస్ చేస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలు

Theatrical Business: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యువ స్టార్ హీరోలలో నాచురల్ స్టార్ నాని మరియు విజయ్ దేవరకొండ పేర్లు ముందే ఉంటాయి. విజయ్ దేవరకొండ కంటే నాని ఇండస్ట్రీకి ముందు వచ్చాడు. కానీ విజయ్ దేవరకొండ కూడా చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి స్టార్డం ను అందుకున్నాడు. వరుసగా ప్లాపులు వచ్చినప్పటికీ ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డిమాండ్ వల్ల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేసి మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడటం లేదు. ముందు సినిమాతో సంబంధం లేకుండా నాని మరియు విజయ్ దేవరకొండ సినిమాలు అద్భుతమైన నాన్ థియేట్రికల్ బిజినెస్ లు చేస్తున్నాయి.

ఒకవైపు డిజిటల్ రైట్స్ మరియు ఇతర భాషల సాటిలైట్ రైట్స్ తో సినిమాలన్నీ నాన్ థియెట్రికల్ బిజినెస్ తోనే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా నాని తదుపరి సినిమా "దసరా" విషయంలో కూడా అదే జరిగింది. శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో మార్చి 30న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాని నిర్మాత 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా లను నిర్మిస్తున్న నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. సినిమాని ఎంత భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే దాదాపు డబ్బులు వెనక్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి సినిమా థియేటర్లలో కలెక్షన్లు అందుకోకపోయినా అంత భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు తక్కువే.

తమ సినిమాలతో నాని మరియు విజయ్ దేవరకొండ 100 కోట్ల దాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను చేసేస్తున్నారు. అందుకే వీరు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి నాని మరియు విజయ్ దేవరకొండ పాతిక కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అని సమాచారం.

Tags:    

Similar News