Mahesh: మహేష్ గుంటూరు కారం, ఎన్టీఆర్ రాఖీ చిత్రానికి ఉన్న లింక్ ఇదే..గుంటూరు కారంపై ట్రోలింగ్స్..
గుంటూరు కారం చిత్రానికి హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారు. ఈ ట్యాగ్ లైనే ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది.
Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంపై ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో మొదలయ్యాయి. నట శేఖర్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని టైటిల్ గ్లింప్స్ ను మే 31న రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో మహేష్ బాబు రస్టిక్ లుక్ లో కనిపించి ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. అయితే గ్లిమ్స్ లో మహేష్ బీడీ 3డీ డైలాగ్, అలాగే సూపర్ స్టార్ తలకట్టు, అలాగే టైటిల్ ట్యాగ్ లైన్ పై ట్రోలర్స్ గట్టిగా వేసుకుంటున్నారు.
మే 31 నో టుబాకో డే..అలాంటి రోజున మహేష్ బాబు పొగాకుకు వ్యతిరేకం అని చెప్పాల్సింది పోయి..తానే బీడీ తాగుతూ కనిపించడంపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన వ్యక్తి బీడీతో కనిపిస్తే..ఫ్యాన్స్ ఇన్ ఫ్లూయెన్స్ అవ్వరా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ట్యాగ్ లైన్ విషయంలో కూడా త్రివిక్రమ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.
గుంటూరు కారం చిత్రానికి హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారు. ఈ ట్యాగ్ లైనే ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కృష్ణ వంశీ కాంబినేషన్ లో 2006లో వచ్చిన రాఖీ చిత్రానికి హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ వాడారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ..త్రివిక్రమ్ కు కొత్త ట్యాగ్ లైన్ క్రియేట్ చేసే సత్తా లేదా అని ఆడుకుంటున్నారు.
అలాగే తన గుంటూరు కారం హీరో మహేష్ బాబును చూపించిన విధానంపై కూడా నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ అల వైకుంఠపురంలో అల్లుఅర్జున్ ను గుర్తుకు తెచ్చే విధంగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. మహేష్ బాబు తలకు ఎర్ర కండువ కట్టి..బీడీ కాల్చడం సేమ్ టు సేమ్ అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ స్టైల్ ని గుర్తు చేస్తోందంటున్నారు. మొత్తంగా, గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్స్ పై నెట్టింట ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతుంటే..అందుకు ధీటుగా టైటిల్ గ్లిమ్స్ లక్షల వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.