Trisha: పెళ్లి గురించి రియాక్ట్ అయిన త్రిష

Trisha: పెళ్లి గురించి అప్డేట్ ఇచ్చిన స్టార్ సీనియర్ బ్యూటీ

Update: 2022-10-09 15:00 GMT

Trisha: పెళ్లి గురించి రియాక్ట్ అయిన త్రిష

Trisha: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సీనియర్ హీరోయిన్ లలో త్రిష కూడా ఒకరు. దాదాపు ఈమె రెండు దశాబ్దాల కెరీర్‌లో తమిళ, తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది ఈమె. అయితే పెళ్లికి మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ లలో త్రిష పేరు ముందే ఉంటుంది. ఇప్పటి వరకు ఈమె పెళ్లి చేసుకోలేదు. గతంలో వరుణ్ అనే వ్యక్తి తో త్రిష నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. గతంలో రానా తో కూడా త్రిష ప్రేమ లో ఉందని వార్తలు వినిపించాయి కానీ వాళ్ళు కూడా పెళ్లి దాకా వెళ్ళలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి ప్లాన్స్ గురించి చెప్పింది త్రిష.

"నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వారు అడిగే విధానం నాకు అసలు నచ్చదు. సాధారణంగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అని అడిగితేనే మీకు సమాధానం వస్తుంది. ఎప్పుడు అంటే నాకు కూడా తెలియదు. అది పూర్తిగా నేను ఎవరితో ఉన్నాను, నేను ఎవరిని కలవబోతున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను జీవితాంతం ఉండగలిగే వ్యక్తి ఇతనే అని నాకు అనిపించాలి. నాకు విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవడం నాకు వద్దు. నా చుట్టూ ఉన్న చాలా మంది పెళ్ళయాక అసంతృప్తిగా ఉన్నారు. నేను అలాంటి పెళ్లిలో ఉండాలనుకోను" అని త్రిష చెప్పుకొచ్చింది. సినిమాల పరంగా చూస్తే త్రిష తాజాగా "పొన్నియిన్ సెల్వన్" సినిమాలో నటించింది.

Tags:    

Similar News