ARM: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోన్న 'ఏఆర్‌ఎమ్‌'.. నాలుగు రోజుల్లోనే..

ARM: మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా, జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏఆర్‌ఎమ్‌.

Update: 2024-09-17 09:45 GMT

ARM: మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా, జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏఆర్‌ఎమ్‌. అజయంతే రాండమ్ మోషణం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 35 కోట్లు రాబట్టి విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు డిబు నైనన్ థామస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ మేకోవర్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పట్లో మరె పెద్ద సినిమా లేకపోవడంతో ఏఆర్‌ఎమ్‌ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Tags:    

Similar News