Movies: బడ్జెట్‌ రూ. 45 కోట్లు.. కలెక్షన్స్‌ రూ. 45 వేలు.. ఇంతకా సినిమా ఏంటంటే..?

Flop Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌ సర్వసాధారణంగా మారిపోయింది.

Update: 2024-11-04 06:46 GMT

Movies: బడ్జెట్‌ రూ. 45 కోట్లు.. కలెక్షన్స్‌ రూ. 45 వేలు.. ఇంతకా సినిమా ఏంటంటే..?

Flop Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌ సర్వసాధారణంగా మారిపోయింది. ఓటీటీలు వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో కనివినీ ఎరగని రీతిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా విజయం కూడా వచ్చే కలెక్షన్స్‌ ఆధారంగానే డిసైడ్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ వసూళ్లు వస్తాయన్న ధోరణి పెరిగిపోయింది.

అయితే బడ్జెట్‌ ఉంటే చాలా.? కంటెంట్‌ బాగా లేకపోయినా పర్లేదా.? అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని ప్రేక్షకులు తేల్చి చెప్పేస్తున్నారు. 2023లో వచ్చిన ఈ బాలీవుడ్‌ మూవీనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ సినిమాను ఏకంగా రూ. 45 కోట్లతో తెరకెక్కిస్తే కేవలం రూ. 45 వేలు మాత్రమే రాబట్టింది. ఇంతకీ ఏంటా సినిమా.? దాని కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

అర్జున్‌ కపూర్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం 'లేడీ కిల్లర్‌'. అజయ్‌ బహ్ల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏకంగా రూ. 45 కోట్లు ఖర్చు చేశారు. 2023 నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. ఎంతలా అంటే ఈ సినిమా బడ్జెట్‌లో కేవలం 0.001 శాతం మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 45 వేలు మాత్రమే కావడం గమనార్హం. అదేంటీ ఓటీటీ రైట్స్‌తో అయినా ఆదాయం వస్తుంది కదా అని అనుకుంటున్నారా.?

అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోలేవు. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు కూడా జరిగాయట. కానీ సినిమా రిజల్ట్ చూశాక నెట్ ఫ్లిక్ తో డీల్ కుదరలేదని సమాచారం. అందుకే ఈ సినిమాను యూట్యూబ్‌లోవిడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా తొలి రోజు రూ. 38 వేలు రాబట్టగా, ఆ తర్వాత రోజుల్లో మొత్తం కలిపి రూ. 45 వేలు రాబట్టింది.

Tags:    

Similar News