Tollywood: టాలివుడ్‌లో ఏం జరుగుతోంది.. ఇంతకాలం ఈ రాసలీలలు తెరవెనుక రహస్యంగా దాగి ఉన్నాయా?

Tollywood News: కేరళలో వేసిన హేమ కమిటీతో తెలుగు ఇండస్ర్టీ కూడా ఉల్లిక్కిపడుతోందా? లేక సమంత లాంటి హీరోయిన్లు ప్రశ్నించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలనం వచ్చిందా?

Update: 2024-09-18 06:07 GMT

టాలివుడ్‌లో ఏం జరుగుతోంది.. ఇంతకాలం ఈ రాసలీలలు తెరవెనుక రహస్యంగా దాగి ఉన్నాయా?

Telugu Film Industry: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువైయ్యాయా? ఇంతకాలం ఈ రాసలీలలు తెరవెనుక రహస్యంగా దాగి ఉన్నాయా? సడన్‌గా ఇప్పుడే ఈ అరాచకాలు ఎందుకు బయటికి వచ్చాయి? కేరళలో వేసిన హేమ కమిటీతో తెలుగు ఇండస్ర్టీ కూడా ఉల్లిక్కిపడుతోందా? లేక సమంత లాంటి హీరోయిన్లు ప్రశ్నించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలనం వచ్చిందా? టాలివుడ్‌లో ఏం జరుగుతోంది? తెలుగు ఇండస్ట్రీ వేసిన కమిటీ ముందు ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు ఇస్తున్నారా? టాలివుడ్ మహిళలపై వేధింపుల జరిగితే తెలుగు కమిటీ ఏం చేస్తుంది?

సెక్సువల్ హరాస్‌మెంట్...ఇది రెగ్యులర్‌గా వినిపించేం పదం. సమాజంలో అనేక రంగాల్లో ఈ వేధింపుల సంఘటనలు బయట పడుతున్నప్పటికీ సెలబ్రిటీలు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం అప్పుడప్పుడు లైంగిక వేధింపుల ఘటనలు బయట పడుతుంటాయి. ఇవి బయటపడినప్పుడు మాత్రమే నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో హడావిడి కనిపిస్తుంది. ఆ తరువాత అంత మామూలే అనే ధోరణి సినిమా రంగంలో ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్. అయితే ఈ మధ్య కేరళ రాష్ట్రంలో జెస్టిస్ హేమ కమిటీ సృష్టించిన సంచలనంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా చలనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండిస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై మరో సారి చర్చ ప్రారంభమైంది.

ఇటీవల హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం కూడా ఇండస్ట్రీని కుదిపేసింది. లావణ్య ఏకంగా రాజ్ తరుణ్ పై పెద్ద యుద్ధమే చేస్తోంది. అయితే ఈ ఘటన పరిశ్రమ పరిధిలోనే ఉన్నప్పటికి కమిటీ సుమోటోగా తీసుకునే అవకాశం లేదు. లావణ్య ఈ కమిటీకి ఫిర్యాదు కూడా చెయ్యలేదు. అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీ వర్కింగ్ ప్లేస్‌లో జరిగిన సంఘటనలపై మాత్రమే ఝాన్సీ కమిటీ స్పందిస్తుంది. బాధిత మహిళలు ఫిలిం చాంబర్ పేరు మీద ఫిర్యాదును కొరియర్ కూడా చేయవచ్చని ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చెప్పారు. నేరుగా ఫిలిం ఛాంబర్‌కు వచ్చి కూడా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా సంచలనమే. శ్రీరెడ్డి తరువాత తాజాగా కొరియోగ్రాఫర్ల ఘటన వెలుగు చూసింది. మరి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయని వేచి చూడాలి. కేరళ మాదిరిగానే తెలుగు ఇండస్ట్రీలో ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణ జరిపితే ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్నా చాలా మంది పేర్లు బయటకు వస్తాయన్న చర్చ టాలీవుడ్‌లో జోరుగా సాగుతుంది. 

Full View


Tags:    

Similar News