నాగార్జున సరికొత్త ఆలోచన.. ఓటీటీ కాదంట ఏకంగా మ్యూజియమే..!
Nagarjuna: టాలీవుడ్ అగ్రకథానాయకుడు నాగార్జున అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తుంటారు.
Nagarjuna: టాలీవుడ్ అగ్రకథానాయకుడు నాగార్జున అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఒకవైపు సినిమాలతో బీజీగా గడుపుతూనే మరోవైపు బిజినెస్ చూసుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అనేక సినిమాలు, సీరియల్స్ కూడా నిర్మించారు. తాజాగా నాగార్జున మరో ఆలోచన వచ్చిందట ఇప్పుడు దానిని అమలు చేయాడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన మూవీ మ్యూజియం స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే డిజిటల్ యుగం వేగం అందుకున్నసంగతి తెలిసిందే. జనాలు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ చేయడమో ఇంకో మార్గంలో ఆన్ లైన్లో వెతకడమో చేస్తున్నారు. అందువల్ల నాగార్జున కూడా డిజిటల్ మ్యూజియం అందుబాటులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారట. ఓ సినిమా ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ.. తన 'ఖైదీ' చిత్రాన్ని మేకర్స్ తనకు అంకితం ఇచ్చారని కానీ.. ఆ సినిమాకు సంబంధించిన ప్రింట్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పారు. 40 సంవత్సరాల కిందటి సినిమాకే ఇలాంటి ఇబ్బంది వస్తే.. అంతకు ముందు వచ్చిన చిత్రాల సంగతేంటీ? అన్న ప్రశ్న రాకమానదు. టాలీవుడ్లో వచ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలను భద్రపరచడంతోపాటు.. ఆయా సినిమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట నాగార్జున.
ఆధునిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని అందరూ గర్వించేలా ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ప్రశ్న నాగార్జునకు ఎప్పుడు వచ్చిందో తెలియదుగానీ.. తెలుగు సినిమాలన్నింటినీ భద్రపరిచే కార్యక్రమం తీసుకోబోతున్నారట. ఓ మూవీ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. నాగార్జున అనునకున్న పని సక్సెస్ అవుతందో లేదో చూడాలంటే కొన్ని రోజు వేచి చూడక తప్పద మరి