Tollywood: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాలీవుడ్ సాంగ్స్

Tollywood: మిలియన్ మార్క్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఈ పదానికి చాలా ప్రత్యేకత ఉంది.

Update: 2021-04-06 13:28 GMT

Tollywood: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాలీవుడ్ సాంగ్స్

Tollywood: మిలియన్ మార్క్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఈ పదానికి చాలా ప్రత్యేకత ఉంది. సినిమా విడుదలకు ముందే కొన్ని పాటలు మిలియన్ మార్క్ వ్యూస్‌కు చేరుకుని సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో 100మిలియన్లకు పైన వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ చాలానే ఉన్నాయి. యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ఆ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నాన్‌ బాహుబలి బ్లాక్‌బస్టర్ అలవైకుంఠపురంలో పాటలు విడుదలకు ముందే ట్రెండ్ సెట్ చేశాయి. ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ బుట్టబొమ్మ ఏకంగా 575 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక ఇదే సినిమాలో మరోసాంగ్ రాములో రాముల 353, సామజ వరగమన 227 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని రికార్డులు సృష్టించాయి.

ఫిదా మూవీలో వచ్చిండే సాంగ్ ప్రేక్షకులను సినిమా విడుదలకు ముందే ఫిదా చేసేసింది. ఈ పాట దాదాపు 295 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత డీజేలోని సీటీమార్ 202, ఛలో మూవీలోని చూసీ చూడంగానే 169, ఎంసీఏ నుంచి ఏవండో నానీగారు 118, గీత గోవిందం నుంచి ఇంకేం ఇంకేం కావాలే 115 మిలియన్ మార్క్ సాధిస్తే రీసెంట్ మూవీ ఉప్పెనలో నీ కళ్లు నీలి సముద్రం పాట 204 మిలియన్ వ్యూస్‌తో సత్తా చాటింది.

ఇక ఈ జాబితాలో లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ 101మిలియన్లతో దూసుకుపోతుండగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యూస్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇలా విడుదలకు ముందే మూవీ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా చెబుతున్నారు మూవీ లవర్స్. 

Tags:    

Similar News