శ్రీమ‌తితో దిల్ రాజు తొలి సెల్ఫీ.. వైరల్‌గా మారిన ఫోటో

Update: 2020-05-13 04:52 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ కు సమీపంలోని నర్సింగ్ పల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు రెండో వివాహాం చేసుకున్నారు. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన 20 మంది సమక్షంలో నిరాడంబరంగా ఈ పెళ్లి కార్యక్రమం జరిగింది. గ‌త రెండు రోజులుగా దిల్ రాజు పెళ్ళి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, ఆయ‌న పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి.

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది.. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు ఈ నేపథ్యంలో కూతురు , బంధువుల ఒత్తిడి మేరకు దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. కాగా, దిల్ రాజు వివాహమాడిన యువతి ఎవరన్న విషయమై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆమె పేరు తేజస్విని అని, బ్రాహ్మణ యువతని కొందరు అంటుండగా, మరికొందరు ఆమె పేరు వైఘా రెడ్డి అని, దిల్ రాజు కుటుంబానికి దగ్గరి వ్యక్తేనని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో ఉన్న సస్పెన్స్ ను దిల్ రాజే తీర్చాలని కోరుతున్నారు. ఏదేమైన ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా శ్రీమ‌తితో క‌లిసి దిల్ రాజు దిగిన సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News