మిడిల్ క్లాస్ వారికే ఓటు హక్కు ఉండాలి: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Comments On Vote : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఓటు హక్కు పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.. దేశంలో ఓటు హక్కుపై ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన అభిప్రాయాలు వెల్లడించాడు
Vijay Devarakonda Comments On Vote : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఓటు హక్కు పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.. దేశంలో ఓటు హక్కుపై ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన అభిప్రాయాలు వెల్లడించాడు. లిక్కర్ కోసం ఓటు అమ్ముకునేవారికి ఓటు హక్కు ఉండరాదన్నాడు. అటు ధనవంతులకు కూడా ఓటు హక్కు అవసరం లేదని తెలిపాడు. కేవలం చదువుకున్న మిడిల్ క్లాస్ వారికే ఓటు విలువ తెలుసని.. వారికే ఇది ఉండాలన్నాడు. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఈ అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుంటే ఇంకొందరు మాత్రం విజయ్ కామెంట్లను తప్పుబడుతున్నారు.
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.. ఇక ఆ సినిమా తర్వాత గీతా గోవిందం భారీ హిట్ కావడంతో విజయ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇక ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అంతగా మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చార్మీ రూపొందిస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమా విజయ్ కి పదోది కాగా, పూరికి 37 వ సినిమా .