'సైరా' కి ఏడాది.. సంతోషంలో చరణ్!

Syeraa Completes One Year : మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం 'సైరా' నరసింహరెడ్డి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు

Update: 2020-10-02 10:27 GMT

Syeraa 

Syeraa Completes One Year : మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం 'సైరా' నరసింహరెడ్డి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా సినిమాని రిలీజ్ చేయగా సినిమా ఘన విజయం అందుకుంది. నేటితో ఈ సినిమాకి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా సినీ నిర్మాత రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.. 'ఉత్తమమైన అనుభవం.. గొప్ప నటీనటులు.. సమర్థవంతమైన సాంకేతిక బృందం.. 'సైరా' విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది. 'సైరా'లో భాగమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ చరణ్ పేర్కొన్నాడు.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. " ఈ సినిమాకి సరిగ్గా ఏడాది.. ఈ సినిమాని తెరకెక్కించిన అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నన్ను నమ్మిన చిరంజీవికి, నన్ను ప్రోత్సహించిన రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. గోసాయి వెంకన్న పాత్రకి అడగగానే ఒప్పుకున్న అమితాబ్ బచ్చన్ కి కృతజ్ఞతలు.. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని సురేందర్ రెడ్డి తెలిపారు..

చరిత్రలో కనుమరుగైన వీరుడు మజ్జారి నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ ఈ కథని ఎప్పుడో రాయగా అప్పుడు భారీ బడ్జెట్ అవ్వడంతో సినిమాని తెరకెక్కించలేకపోయారు.. బాహుబలి లాంటి సినిమా వచ్చి మంచి విజయం సాధించి తెలుగు సినిమా స్థాయిని  పెంచడంతో ఈ సినిమాని తెరకెక్కించాలని చిరంజీవి అనుకున్నారు. దొరికిన క‌థ‌కు కొంత కల్పిత కథను జోడించి కమర్షియల్ యాంగిల్‌లో 'సైరా నరసింహారెడ్డి' సినిమాను తెరకెక్కించారు సురేందర్ రెడ్డి.. . దాదాపు 270 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పలు బాషలలో రిలీజ్ చేశారు. 

Tags:    

Similar News