కరోనా నుంచి కోలుకున్న హీరో రాజశేఖర్‌

యాంగ్రీ హీరో రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకున్నారు.. ఆయన సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగిటివ్ రావడం, ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు అయనని డిశ్చార్జ్ చేసారు

Update: 2020-11-09 14:50 GMT
కరోనా నుంచి కోలుకున్న హీరో రాజశేఖర్‌
  • whatsapp icon

యాంగ్రీ హీరో రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకున్నారు.. ఆయన సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగిటివ్ రావడం, ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు అయనని డిశ్చార్జ్ చేసారు. ఈ విషయాన్ని రాజశేఖర్ సతిమణి జీవిత వెల్లడించారు. ఇటీవల రాజశేఖర్‌ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో శివానీ, శివాత్మిక త్వరగా కోలుకోగా ఆ తర్వాత జీవిత కోలుకున్నారు..

ఇక రాజశేఖర్‌ ఆరోగ్యం మాత్రం క్షిణించింది.. రాజశేఖర్‌ ఆరోగ్యం క్షిణించడంతో అయన అభిమానులు ఆందోళనకి గురయ్యారు.. అటు హీరో రాజశేఖర్ కి వైద్యులు మెరుగైన చికిత్సని అందించారు.. ఆయన ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు.. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు అయనని డిశ్చార్జ్ చేసారు. రాజశేఖర్‌ డిశ్చార్జ్ కావడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. ముందుగా రాజశేఖర్ ఆరోగ్యం చాలా క్రిటికల్‌ స్టేజికి వెళ్లిందని, వైద్యులు తీవ్రంగా కృషి చేసి ఆయనను కాపాడరని జీవిత తెలిపారు.. ఆయన త్వరగా మళ్ళీ కోలుకోవాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలని జీవిత తెలిపారు.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా మంచి సక్సెస్ కావడంతో రాజశేఖర్ హీరోగా మళ్ళీ బిజీ అయిపోయారు. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చారు రాజశేఖర్.. ప్రస్తుతం ఆయన నటించిన అర్జున్‌ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ భావించారు కానీ కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది. అటు రాజశేఖర్ కుమార్తెల కూడా తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News